'ది లైఫ్ ఆఫ్ జీసస్/యేసు జీవితం' ఆయన సన్నిహితులు చెప్పిన కథ. బైబిల్‌లోని యోహాను పుస్తకం నుండి ఈ కధ తీసుకోవడం జరిగింది. యేసు తన జీవితం ద్వారా చరిత్ర గతిని ఎలా మార్చాడో ఈ సినిమా ద్వారా తెలుసుకోండి!
2,000 సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు జన్మించాడు. ఆయన జీవితం మరియు మరణం ప్రపంచాన్ని శాశ్వతంగా మార్చింది. ఇప్పటికీ తన ప్రభావంతమైన బోధలు మరియు అద్భుతాల ద్వారా అనేక జీవితాల్లో శాశ్వత ప్రభావాన్ని ఆయన కనపరుస్తున్నాడు. అంతే కాదు ఆయన శక్తివంతమైన సందేశాలు ప్రపంచవ్యాప్తంగా 2.3 బిలియన్ల మంది ప్రజలను ఈ రోజుకి రూపంతర పరుస్తున్నాయి.
ఈ సినిమా వీక్షించినందుకు మరియు మాతో కనెక్ట్ అయినందుకు ధన్యవాదాలు!
గమనిక: వ్యాఖ్యానించేటప్పుడు, దయచేసి వ్యక్తులు మీతో ఎలా ప్రవర్తించాలని మీరు కోరుకుంటున్నారో అలాగే వారితో మీరు అలాగే వ్యవహరించండి!♥
యోహాను సువార్తలోని అధ్యాయాలు :
0:00:00 యోహాను సువార్త పరిచయం
0:00:51 యోహాను 1: బాప్తిస్మమిచ్చు యోహాను & యేసు మొదటి అనుచరులు
0:12:50 యోహాను 2: ఆశ్చర్యకరమైన వివాహం & దేవాలయం వద్ద యేసు ప్రదర్శించిన కోపం
0:20:00 యోహాను 3: యేసుతో నికోదేము మరియు యోహాను ముఖాముఖీ
0:25:17 యోహాను 4: స్వస్థత కథలు | సమరయ స్త్రీ | యేసు ఒక అధికారి కుమారుని స్వస్థపరచుట
0:34:14 యోహాను 5: బేతెస్ద కోనేరు వద్ద స్వస్థత
0:42:46 యోహాను 6: యేసు సముద్రము మీద నడుచుట
0:57:39 యోహాను 7: ఆయన మెస్సీయానా?
1:05:11 యోహాను 8: వ్యభిచారం: మీరు పట్టబడినప్పుడు ఏమి జరుగుతుంది?
1:16:20 యోహాను 9: యేసు పుట్టు గ్రుడ్డియైన యొక మనుష్యుని స్వస్థపరిచాడు
1:24:20 యోహాను 10: మంచి కాపరి
1:30:36 యోహాను 11: లాజరు వృత్తాంతం
1:40:51 యోహాను 12: యేసు తన మరణం గురించి మాట్లాడెను
1:51:13 యోహాను 13: యేసు తన శిష్యుల పాదములు కడుగుట
2:00:10 యోహాను 14-16: చివరి ప్రసంగం: యేసు తన స్నేహితులను ఓదార్చాడు
2:14:34 యోహాను 17: యేసు ప్రార్ధన
2:18:52 యోహాను 18: యేసు బంధించబడుట
2:27:59 యోహాను 19: యేసు మరణం
2:40:50 యోహాను 20: యేసు మరణం నుండి తిరిగి లేచాడు
2:47:37 యోహాను 21: గలలీయ సముద్రంలో నమ్మశక్యం కానీ విధముగా చేపలను పట్టుట
ఇది ‘ది లైఫ్ ఆఫ్ జీసస్’ / ‘యేసు జీవితం’ యొక్క అధికారిక YouTube ఛానెల్.
'యోహాను సువార్త' ఆధారముగా తీసిన ‘ది లైఫ్ ఆఫ్ జీసస్’/’యేసు జీవితం’ అనే ఈ చిత్రం 2003 టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రత్యేకముగా ప్రదర్శించబడింది. మూడు గంటల నిడివి గల ఈ చిత్రం ఖచ్ఛితముగా బైబిల్లోని యోహాను సువార్త ఆధారముగానే తీయడం జరిగింది. కెనడియన్ కంపెనీకి చెందిన ‘విజువల్ బైబిల్ ఇంటర్నేషనల్’ వారు ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ బ్రిటిష్ ఫిల్మ్ మేకర్ ఫిలిప్ సవిల్లే ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ప్రముఖ నటుడు హెన్రీ ఇయాన్ కుసిక్ ఈ చిత్రంలో ఉన్న యేసు పాత్రలో నటించాడు.
మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ♥
Смотрите видео యేసు యొక్క జీవితం | Telugu | Official Full HD Movie онлайн без регистрации, длительностью часов минут секунд в хорошем качестве. Это видео добавил пользователь Jesus.net 23 Июнь 2023, не забудьте поделиться им ссылкой с друзьями и знакомыми, на нашем сайте его посмотрели 247,634 раз и оно понравилось 2.9 тысяч людям.