పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు ఇవాళ విరామం ఇచ్చిన చమురుసంస్థలు..... విమాన ఇంధనం, వాణిజ్య సిలిండర్ ధరలు పెంచాయి. 19 కిలోల వాణిజ్య సిలిండర్ పై 250 రూపాయలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. గృహ సంబంధ వినియోగదారులకు అందించే సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదని పేర్కొన్నాయి. విమాన ఇంధన ధరలను 2 శాతం పెంచగా... ఇది రికార్డు స్థాయి ధరను చేరుకుంది. జనవరి 1 నుంచి ఇప్పటివరకు విమాన ఇంధన ధరలు 50శాతం పెరిగాయి. అంతర్జాతీయంగా పెరిగిన ఇంధన ధరలకు అనుగుణంగా పెంచినట్లు చమురుసంస్థలు తెలిపాయి. విమాన ఇంధన ధర కిలోలీటరుకు 2 వేల 258 పెరిగినట్లు తెలిపాయి. దీంతో దిల్లీలో విమాన ఇంధన ధర కిలోలీటరుకు లక్షా 12 వేల 924కు చేరింది. అంతర్జాతీయ ఇంధన ధరలకు అనుగుణంగా ప్రతీ 15 రోజులకు ఒకసారి ధరలు విమాన ఇంధన ధరలు సవరిస్తున్నారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి విమాన ఇంధన ధరలు7 సార్లు పెంచారు.
#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
Смотрите видео Commercial LPG Cylinder Price Hiked By ₹ 270, To Cost Over ₹ 2,250 онлайн без регистрации, длительностью часов минут секунд в хорошем качестве. Это видео добавил пользователь ETV Andhra Pradesh 31 Март 2022, не забудьте поделиться им ссылкой с друзьями и знакомыми, на нашем сайте его посмотрели 18,545 раз и оно понравилось 161 людям.